schedule Monday, September 07, 2026

పిల్లలు లేని వారికి శుభవార్త..!

calendar_today June 27, 2024
person dharshininews
పిల్లలు లేని వారికి శుభవార్త..!
chai jrపిల్లలు లేని వారికి శుభవార్త..! - రేపు సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య శిబిరం - తాండూరు నర్సింగ్ హోమ్‌లో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : పిల్లలు లేని దంపతులకు తాండూరు నర్సింగ్‌ హోమ్ ఆసుపత్రి వారు శుభవార్త చెప్పారు. రేపు శుక్రవారం తాండూరు పట్టణం సీసీఐ రోడ్డు మార్గంలోని ఆసుపత్రిలో సంతానం లేని దంపతులకు ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి వైద్యులు డా.హుస్సా మహమ్మద్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఇందిరా ఐవీఎఫ్‌ ఆసుపత్రి వైద్య నిపుణుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందిరా ఐవీఎప్‌ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది దంపతులు పిల్లలు లేని వారికి సంతాన పాఫల్యం కలిగించే వైద్య సేవలు అందించారని గుర్తుచేశారు. తాండూరు నర్సింగ్‌ హోంలో ఉచితంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తాండూరు నియోజకవర్గ దంపతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్: 9704736536కు సంప్రదించాలన్నారు. ఇదికూడ చదవండి.. https://www.dharshininews.com/27458/