schedule Saturday, July 04, 2026

టైం.. ట్రీట్‌మెంట్‌..!

calendar_today June 28, 2024
person dharshininews
టైం.. ట్రీట్‌మెంట్‌..!
chai jr టైం.. ట్రీట్‌మెంట్‌..! - సమయ పాలన, వైద్యంపై దృష్టి పెట్టాలి - రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి - వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ - తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆసుపత్రిలో సమయ పాలన పాటించి.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ప్రతీక్ జైన్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని క్యాసువాలిటీ, మహిళలు, పురుషుల వార్డులు, మందుల గది తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎంత మంది వైద్యులు, సిబ్బంది ఉన్నారని సూపరిండెంట్ డా. మూర్తిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు రోగులు ఎంత మంది వస్తారు, వారికి సరిపడా వసతులు, సౌకర్యాలు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రిలో కొరవడిన సదుపాయాలు, సౌకర్యాలతో పాటు పారిశుద్యం, విద్యుత్, తాగునీరు వంటి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వైద్యులు సమయానికి రావాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితులకు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేవించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని హెచ్చరించారు. త్వరలో ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి దృష్టి సారిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాస్ రావు, తహసీల్దార్ తారాసింగ్, ఆసుపత్రి వైద్యులు డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27465/