schedule Friday, September 11, 2026

అటవీశాఖ అధికారులపై వేటు

calendar_today July 3, 2024
person dharshininews
అటవీశాఖ అధికారులపై వేటు
chai jr అటవీశాఖ అధికారులపై వేటు - వికారాబాద్‌, తాండూరు ఎఫ్‌ఆర్వోల సస్పెండ్‌ - ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని ఇద్దరు అటవీశాఖ అధికారులపై వేటు పడింది. వికారాబాద్‌, తాండూరు అటవీశాఖ రేంజ్ ఆఫీసర్లు(ఎఫ్‌ఆర్వో)ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అటవీ శాఖలో తూనీకాకు కూలీలకు సంబంధించిన కూలీ డబ్బుల విషయంలో వికారాబాద్‌ ఎఫ్‌ఆర్వో అరుణ, తాండూరు ఎఫ్‌ఆర్వో శ్యాంసుందర్‌ రావులు అవినీతికి పాల్పడ్డట్లు ఆరోఫణలు వచ్చాయి. దీనిపై అటవీశాఖ ఉన్నతాధికారులు విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేయించారు. ఈ విచారణలో వారు అవినీతికి పాల్పడ్డట్లు తేలింది. దీంతో ఉన్నత అధికారులు ఇద్దరు అధికారులపై వేటు వేశారు. వికారాబాద్‌, తాండూరు ఎఫ్‌ఆర్వోలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/27554/