schedule Saturday, July 04, 2026

తపాలా బీమా పథకాలు వరం

calendar_today July 12, 2024
person dharshininews
తపాలా బీమా పథకాలు వరం
తపాలా బీమా పథకాలు వరం - పాలసీ దారులకు బీమా చెక్కుల పంపిణీ - సీనీయర్ సూపరింటెండెంట్ ఎ.సుబ్రమణ్యం - తాండూరు, దర్శిని ప్రతినిధి : తపాలా శాఖలోని బీమా పథకాలు వరంగా నిలుస్తాయని ఆ శాఖ సికింద్రాబాద్ డివిజన్ సూపరింటెండెంట్ ఎ.సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం తాండూరు తపాలా శాఖ ఆధ్వర్యంలో బీమా పాలసీ దారులకు చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎ. సుబ్రమణ్యం హాజరై పాలసీ దారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దేముల్ మండల సబ్ పోస్టా ఫీసు నాగులపల్లి బ్రాంచ్ లో శ్రీరాములు గౌడ్ అనే వ్యక్తి తపాలా శాఖలో అమలు చేస్తున్న రూ. 520(వార్షిక ప్రీమియం) టాటా గాగ్ పాలసీనీ తీసుకున్నారని తెలిపారు. పాలసీ తీసుకున్న రెండు నెలలకే విద్యుత్ షాక్ తో ఆయన మరణించారని తెలిపారు. దీంతో నామినీగా ఉన్న భార్య జయమ్మకు రూ. 10లక్షల బీమా మంజూరయ్యిందని తెలిపారు. అదేవిధంగా పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకున్న మరో ఇద్దరు నామినీలు ఎ స్. అరుణ, చాంద్ మియాలకు రూ. 2లక్షల 9వేల 600లు, రూ.91 వేల 19ల చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ మేరకు వారికి చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. తపాలా శాఖలో అమలు చేస్తున్న టాటా గాగ్ పాలసీ పేదలకు వరంగా ఉంటుందన్నారు. ఈ బీమా కింద రూ. 10లక్షల కవరేజీ అందుతుందని, విద్యుత్ పాముకాటు, తదితర ప్రమాదాల మరణాలకు వర్తిస్తుందన్నారు. శాశ్విత వైకల్యం, రూ. 1 లక్ష వరకు వైద్య ఖర్చులు, పిల్లల విద్యా ప్రయోజనాలకు వర్తిస్తుందన్నారు. ఈ పాలసీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎస్ ఓ క్రాంతి, పోస్టు మాస్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27710/