schedule Saturday, July 04, 2026

కన్నీళ్ల కాన్పు..!

calendar_today July 15, 2024
person dharshininews
కన్నీళ్ల కాన్పు..!
కన్నీళ్ల కాన్పు..! - పుట్టిన కాసేపటికే పసికందు మృతి - తాండూరు ఎంసీహెచ్‌లో ఘటన - వైద్యుల నిర్లక్ష్యమన్న కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి కన్నీళ్ల కాన్పు మిగిలింది. పుట్టిన కాసేటికే పసికందు మృతి చెందింద. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కుటుంభీకులు ఆరోపించారు. ఈ సంఘటన తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... వికారాబాద్ జిల్లా బంటారం మండలం రేగడి మైలారంకు చెందిన శివకుమార్ భార్య కవిత దంపతులు. శివకుమార్ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కవిత గర్భం దాల్చడంతో ఆమె తన గారి ఊరు అయిన యాలాల మండలం దేవనూర్ గ్రామానికి వచ్చింది. ఆదివారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంభీకులు ప్రసవం కోసం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. ఉదయం ఆసుపత్రిలో చేరితే రాత్రి ప్రసవం జరిగింది. మగ బిడ్డ జన్మించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కాని కొద్ది సేపటికే పసికందు మృతి చెందినట్లు తెలిపారని కవిత భర్త శివకుమార్ తెలిపారు. తన భార్య ప్రసవం విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్లే తమ పసికందు మృతి చెందినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆసుపత్రి ఆర్ఎంఓ డా.అనిల్ మాట్లాడుతూ ప్రసవం తరువాత పసికందు ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించామని, అయితే పసికందుకు శ్వాసకోస సమస్య తలెత్తడంతో ఊపిరి ఆడలేదన్నారు. ఈ కారణంగానే పసికందు మరణించి ఉంటుందని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేమి లేదని స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27722/