schedule Saturday, July 04, 2026

సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల

calendar_today August 6, 2024
person dharshininews
సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల
సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల - సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ - రేపటి నుంచే మీసేవాలలో స్లాట్ల బుకింగ్ - ఆగస్టు, సెప్టెంబర్‌లలో తేదిల వివరాలివే.. వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో ప్రతి నెల నిర్వహించే సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు సంబంధించిన క్యాంపు వివరాలను ప్రకటించారు. ఈ సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. రేపు బుధవారం నుంచే మీసేవాలలో స్లాట్ బుకింగ్స సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. జిల్లాలోని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, వికారాబాద్‌ సీహెచ్‌సీలో ఈ క్యాంపులు జరుగుతాయని వెల్లడించారు. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈనెల ఆగస్టు 08, 16, 22, 29, 31వ తేదిలతో పాటు సెప్టెంబర్ 12,19, 26, 28, 30వ తేదీల్లో అంగవైకల్యం, బుద్ది మాంధ్యత, చెవుడు, మూగ సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆగస్టు 8, 14, 20, 22వ తేదిలతో పాటు సెప్టెంబర్ 12, 17, 19, 24వ తేదీలలో అంగ వైకల్యం, అంధత్వ సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు నెలల్లో మొత్తం 1320 స్లాట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అర్హత కలిగిన వారు సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇది వరకు పొంది సర్టి ఫికేట్ కాల పరిమితి అయి పోయిన హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28089/