schedule Saturday, July 04, 2026

పేదలకు మెరుగైన వైద్యం అందిచడమే లక్ష్యం..!

calendar_today August 8, 2024
person dharshininews
పేదలకు మెరుగైన వైద్యం అందిచడమే లక్ష్యం..!
పేదలకు మెరుగైన వైద్యం అందిచడమే లక్ష్యం..! - ప్రజా ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి పెద్దపీట - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - నియోజకవర్గంలో 197 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో ఆపదలో ఉన్న పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్‌ మండలాల పరిధిలో పలు గ్రామాలకు చెందిన 197 మంది లబ్దిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం పెద్ద పీట వేసిందన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన ఆరోగ్య శ్రీ సేవలను కాంగ్రెస్‌ సర్కారులో కార్పోరేట్‌ స్థాయి వైద్యం అందేలా కృషి చేసిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడిగా ఉపయోగపడుతుందని అన్నారు. కష్ట సమయాల్లో వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవిష్యత్తులో కూడా ఎవ్వరికీ ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28143/