schedule Sunday, July 05, 2026

మందు బాబులపై కొరడా..!

calendar_today August 29, 2024
person dharshininews
మందు బాబులపై కొరడా..!
మందు బాబులపై కొరడా..! - 14 మందికి జైలు, 13మందికి జరిమాన - తాండూరు న్యాయస్థానం తీర్పు - వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులపై కొరడా పడింది. జైలు శిక్షతో పాటు జరిమాన విధిస్తూ తాండూరు న్యాయస్థానం తీర్పు వెలువరించిందని పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీలో పలువురు మందుబాబులు పట్టుబడ్డారు. ఈ మేరకు వారిని కోర్టులో హాజరు పరచగా సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ కేసుల వివరాలను పరిశీలించారు. ఇందులో కె. రమేష్, అంతారం, ఎస్. కిషన్ - రాంనగర్, జహీరాబాద్, హెచ్. సాగర - నీళ్లపల్లి, వీ.బాబు- కోట బాస్పల్లి, ఎండీ.నవాజ్- సేడం, కె. నరేష్ - గోనూర్, ఎస్. వెంకటేష్ - కోట్‌పల్లి, అంబాదాస్ - గుమస్తా నగర్, తాండూరు, ఆశప్ప - తాండూర్, ఎన్. మున్నయ్య - తాండూరు, సాయప్ప- చంద్రవంచ, కె. శాంతు కుమార్ - తాండూరు, ఎం. రవి - తాండూరు, కాశప్ప - తాండూరు మొత్తం 14 మందికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమాన విధించారు. అదేవిధంగా మరో 13 మందికి రూ. 1000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు జరిమానా విధించినట్లు సీఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28608/