schedule Saturday, July 04, 2026

రక్తం పంచిన అభిమానం..!

calendar_today September 21, 2024
person dharshininews
రక్తం పంచిన అభిమానం..!
రక్తం పంచిన అభిమానం..! - బంటు వేణుగోపాల్ కోసం కదలిన యువత - జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : అతనో సామాన్య యువనేత. ఆయన కోసం యువత ఏకమై ఆపదలో ఉండే పేదలకు అందించేందుకు రక్తాన్ని పంచారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన బంటు వేణుగోపాల్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. శనివారం ఆయన జన్మదినోత్సోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో సాయిపూర్ 11వ వార్డు కాలనీకి చెందిన 12 మంది యువకులు12 రక్తదానంకు సిద్దమయ్యారు. జిల్లా ఆసుపత్రిలో సూపర్డెంట్ రవిశంకర్, బంటు వేణుగోపాల్ సమక్షంలో యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సూపరిండెంట్ డా.రవిశంకర్ మాట్లాడుతూ రక్తదానం మహాదానమని రక్త దానం చేయడం వల్ల మరో ప్రాణాన్ని కాపాడవచ్చు అన్నారు. అదేవిధంగా బంటు వేణుగోపాల్ మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా మరో ప్రాణంకు పునర్జన్మ అందించే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని యువకుల సృహను కొనియాడారు. వారికి ఎల్లవేళలా తోడుగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ గౌడ్, వేణు మిత్ర బృందం తాండూర్ పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అల్లపూర్ శ్రీకాంత్ ముదిరాజ్, యాలల మండల బిసి సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణ చారి, శ్రీనివాస్ గౌడ్, బి. చంద్రశేఖర్, వి. రవి, ఈ. నరసింహ గౌడ్, ఈ. నరేందర్ గౌడ్, విష్ణు, నరేష్, ఎన్. చంద్రశేఖర్, నవీన్, భాను, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/29242/