schedule Saturday, July 04, 2026

ధన్వంతరి ఆయుర్వేద చికిత్స శిబిరానికి స్పందన

calendar_today October 22, 2024
person dharshininews
ధన్వంతరి ఆయుర్వేద చికిత్స శిబిరానికి స్పందన
ధన్వంతరి ఆయుర్వేద చికిత్స శిబిరానికి స్పందన - కంటి సమస్యలకు సేవలు పొందిన బాధితులు - సుమారు 400ల మందికి చికిత్సలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం జినుగుర్తి ఏకలవ్యలో ఏర్పాటు చేసిన ధన్వంతరి ఆయుర్వేద చికిత్స శిబిరానికి భారీ స్పందన లభించింది. మంగళవారం ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాట సంప్రదాయ కంటి నిపుణులు ముత్తు కృష్ణన్ వారసుల పర్యవేక్షణలో ఈ శిబిరం నిర్వహించారు. ఇందులో కంటి శుక్లము, కళ్లు ఎర్రబడడం, దృష్టిలోపం, నీరు కారడం, తలనొప్పి, కంప్యూటర్, సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చే సమస్యలకు ప్రత్యేకమైన పద్దతి ద్వారా తయారు చేసిన చుక్కలను కంటివేసి సేవలను అందించారు. ఈ శిబిరానికి తాండూరుతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవపర్స్ అధినేత శంకర్ యాదవ్, ఆయన సతీమణి చంద్రకళ, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్, నాయకులు బంటు మల్లప్ప, దర్మీది రవిందర్, కేశవరావు, అంజిల్ రెడ్డి, బొప్పి శ్రీహరి, మల్ రెడ్డి, ఉపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి, జొన్నల వినోద్, మనోహర్ యాదవ్, కానిస్టేబుల్ వెంకట్ రాంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలమణి, పలువురు ప్రముఖులు కూడా శిబిరంలో చికిత్స తీసుకున్నారు. వారితో పాటు సుమారు 400ల మందికి పైగా చికిత్స శిబిరంలో సేవలను పొందారు. ఈ చికిత్స శిబిరం ప్రతినెల 2వ, 4వ మంగళవారాలలో నిర్వహించడం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29947/