schedule Saturday, July 04, 2026

ఈఎస్ఐ ఆసుపత్రికి లైన్‌ క్లీయర్...!

calendar_today October 24, 2024
person dharshininews
ఈఎస్ఐ ఆసుపత్రికి లైన్‌ క్లీయర్...!
ఈఎస్ఐ ఆసుపత్రికి లైన్‌ క్లీయర్...! - పాత మున్సిపల్‌ ఆఫీసులో ఏర్పాటు - దాదాపు ఖరారు చేసిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు లైన్ క్లీయర్ అయ్యింది. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని అధికారులు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాండూరు నియోజకవర్గ ప్రాంతంలో దాదాపు 25వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కొన్ని ఏండ్ల నుంచి ఈఎస్ఐ ఆసుపత్రి అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ముందడుగు పడింది. తాండూరులోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కార్పోరేషన్ అధికారులకు ప్రతిపాదించారు. ఈ మేరకు బుధవారం ఉన్నత స్థాయి అధికారి నాగేష్‌, ఈఎస్ఐ కార్పోరేషన్ డిప్యూటి డైరెక్టర్ మహేష్‌ కుమార్, ఫైనాన్స్ డిప్యూటి డైరెక్టర్ లాల్ సింగ్, డా.కార్తీక్, ఇంజనీరింగ్ విభాగం జేఈ శంకరయ్యలు తాండూరు పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం భవనాలను పరిశీలించారు. బసవణ్ణ కట్ట సమీపంలోని వసతీ గృహంతో పాటు పాత మున్సిపల్ కార్యాలయన్ని సందర్శించారు. పాత మున్సిపల్ కార్యాలయం అన్నింటికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడే ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని దాదాపు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి ఏర్పాటులో తగిన వసతులు, సౌకర్యాలపై సమగ్ర నివేధిక తయారు చేయాలని భావించడంతో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. ఆరు పడకలు, ఇద్దరు వైద్యులు తాండూరులో ఏర్పాటు చేస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రిలో వసతులు, వైద్యుల నియామకంను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం తాండూరులో 6 పడకలతో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు, సిబ్బందిని కూడా నియమించబోతున్నారు. ఉద్యోగ కార్మికులకు, బీమా చేసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య సేవలను అందించనున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే కార్మికుల వైద్య కష్టాలు దాదాపు దూరమైనట్లే. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29974/