schedule Saturday, September 05, 2026

తప్పిన వాళ్లు మళ్లీ పరీక్ష రాయొచ్చు..!

calendar_today October 25, 2021
person dharshininews
తప్పిన వాళ్లు మళ్లీ పరీక్ష రాయొచ్చు..!
తప్పిన వాళ్లు మళ్లీ పరీక్ష రాయొచ్చు..! - హాజరై ఫెయిల్ ఆయితే సప్లిమెంటరీనే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కాలేని విధ్యార్థులకు మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. సోమవారం నుంచి ఇం టర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభంకాను న్న నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌ నాంపల్లిలోని విద్యా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా వచ్చి.. పరీక్షలు రాయలేని స్థితిలో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి స్పెషల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామన్నారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల్లో హాజరైన విద్యార్థులు ఒకవేళ ఫెయిల్‌ అయితే వారు మళ్లి మార్చ్‌ లేదా ఏప్రిల్‌ల్లో సప్లమెంటరీ పరీక్షలు రాయాల్సిందేనని స్పష్టం చేశారు.