schedule Friday, September 11, 2026

గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాట్లు..!

calendar_today November 5, 2024
person dharshininews
గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాట్లు..!
గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాట్లు..! - వికారాబాద్, తాండూరులో కేంద్రాలు - రాయనున్న 10వేల మంది విద్యార్థులు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఉద్యోగాల భర్తిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూపు-3 పరీక్షలకు వికారాబాద్‌ జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17, 18వ తేదిలలో గ్రూప్-3 పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని వికారాబాద్‌ జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్‌లో 20, తాండూరులో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూపు-3 పరీక్షలకు మొత్తం 10,196 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ సంబంధిత అధికారులతో పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్ లు, శాఖపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలను తీసుకువెళ్లేందుకు బందోబస్తు, ఎస్కార్ట్ల ఏర్పాట్లను చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30349/