schedule Saturday, July 04, 2026

పత్తిని ఆరబెట్టి తీసుకరావాలి

calendar_today November 8, 2024
person dharshininews
పత్తిని ఆరబెట్టి తీసుకరావాలి
పత్తిని ఆరబెట్టి తీసుకరావాలి - నిబంధనల ప్రకారం మద్దతు ధర - రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి - వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ - తాండూరులో పత్తి కొనుగోలు కేంద్రం తనిఖీ - యాలాలలో ఆరోగ్యం కేంద్రం పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు ఆరపెట్టిన పత్తినే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని మారుతి ఇండస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రతీక్ జైన్ తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తో కలిసి తనిఖీ చేశారు. కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతున్నాయి. రైతులకు ఎమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతులతో మాట్లాడుతూ రైతులు పత్తిని ఆరబెట్టుకుని తీసుకరావాలన్నారు. నిబంధనల ప్రకారం పత్తిలో 8శాతం తేమ ఉంటే రూ. 7521, 9శాతం తేమ ఉంటే రూ.7445 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కేంద్రం నిర్వహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన మరోవైపు యాలాల మండలంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. కేంద్రంలో ఓపీ, ల్యాబ్, ఫ్యాన్లు, లైట్లు, సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు ఎక్కువగా ఎందుకు జరగడం లేదని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర భవనంలో రూప్ లీకేజీతో పాటు నిరుపయోగంగా ఉన్న మరుగుగొడ్లను మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సారంగపాణి, ఎంపీడీఓ పుష్పలీల, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30407/