schedule Saturday, July 04, 2026

లగచర్లోళ్లు.. లగెత్తించారు..!

calendar_today November 11, 2024
person dharshininews
లగచర్లోళ్లు.. లగెత్తించారు..!
లగచర్లోళ్లు.. లగెత్తించారు..! - జిల్లా కలెక్టర్ కారుపై రాళ్లదాడి - ధ్వంసమైన కారు అద్దాలు - పొలాల మద్య పరుగెత్తిన అథికారులు - భగ్గుమైన భూసేకరణ పంచాయతీ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూ సేకరణ పంచాయతీ వ్యవహరం భగ్గుమంది. గ్రామస్తులంతా ఏకమై అధికారులను లగెత్తించారు. చర్చలకు వచ్చిన జిల్లా కలెక్టర్ కారుపై రాళ్లతో దాడి చేశారు. సోమవారం ఈ సంఘటన జిల్లాలో హైటెన్షన్ వాతావారణాన్ని తలపించింది. గ్రామంలో ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చే రైతులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక తహసీల్దారుతో కలిసి కలెక్టర్, తాండూరు సబ్ కలెక్టర్, కడా అధికారి కూడా వచ్చారు. లగచర్ల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అధికారులు గ్రామసభను పెట్టారు. గ్రామసభ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఊరి బయట చర్చలకు ఏర్పాట్లు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామసభ వద్ద ఇద్దరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ గ్రామానికి వెళ్లారు. కలెక్టర్ గ్రామానికి రాగానే రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనక్కి వెళ్లాలని కారుపై రాళ్లు విసిరారు. దీంతో కారు అద్దాలు పగిలాయి. దీంతొ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు కారులో బయల్దేరి వెళ్లారు. కారులో వెళుతున్న కూడా ప్రజలు శాంతించకుండా రాళ్లదాడిని ఆపలేదు. ఈ క్రమంలో ప్రత్యేకాధికారి వెంకట్‌ రెడ్డి గాయాలయ్యాయి. పొలాల మద్య పరుగెత్తికెళ్లి బయటకు వచ్చారు. ఈ సంఘటన జిల్లాలో హైటెన్షన్‌గా మారింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30475/