schedule Saturday, July 04, 2026

రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..!

calendar_today November 13, 2024
person dharshininews
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..!
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..! - ఎంపీ డీకే అరుణను అడ్డుకోవడం సరికాదు - సీఎం నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు అప్రజ్వామికం - బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ - అక్రమ అరెస్టులపై బీజేపీ నేతల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : లగచర్ల వివాదంలో రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ నేతలు హెచ్చరించారు. లగచర్లలో రైతులను పరామర్శించేందుకు వచ్చిన పాలమూరు ఎంపీ డీకే అరుణను పోలీసులు చెన్గోముల్ వద్ద అడ్డుకున్నారు. వారితో పాల్గొనేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, కోడంగల్ బీజేపీ ఇంచార్జ్ బంటు రమేష్, నాయకులు సాహు శ్రీలత, బంటారం భద్రేశ్వర్, బాబయ్య, నర్సింలు, రాము సాగర్ లను తుంకిమెట్ల వద్ద పోలీసులు అరెస్టు చేసి బొంరాస్ పేట్ పోలీస్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగచర్లలో ఫార్మా సిటీ వివాదంలో రైతులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రైతులను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ డీకే అరుణను అడ్డుకోవడం సరికాదన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అరెస్టులు చేయడం సంమజసం కాదన్నారు. సీఎం నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. అదేవిధంగా నేతల నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, భయబ్రాంతులకు గురిచేయడం పట్ల మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30541/