schedule Sunday, July 05, 2026

ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు..!

calendar_today November 17, 2024
person dharshininews
ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు..!
ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు..! - తొలి పరీక్షకు తడబడిన అభ్యర్థులు - ఆలస్యంగా రావడంతో అనుమతి నిరాకరణ - పరిశీలించిన సబ్ కలెక్టర్, డీఎస్పీ - కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం గ్రూప్-3 పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10గంటలకు పరీక్ష ప్రారంభం కాగ దానికి ముందే 8-30 గంటల నుంచి 9-30 గంటలలోపు పరీక్ష కేంద్రాలలోకి అభ్యర్థులను అనుమతించారు. ప్రతి ఒక్క అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రాల లోపలికి అనుమతించారు. మధ్యాహ్నం పరీక్షకు కూడా ఇదే విధానాన్ని కొనసాగించారు. ఉదయం జరిగిన పరీక్షకు పలువురు అభ్యర్థులు తడబడ్డారు. నిబంధనపై అవగాహన లేక పలువురు ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్నారు. ఓ అభ్యర్థి స్కూటీపై వస్తూ కిందపడి కూడా పరీక్షకు వచ్చానని చెప్పినా అనుమతించలేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కుత్బుల్లాపూర్ కు చెందిన అభ్యర్థి నిమిషం లేటుగా వచ్చినా అనుమతించలేదు. దాదాపు మరో 6గురు అభ్యర్థులను అనుమతించలేదు. వీరితో పాటు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు. మరోవైపు ఉదయం నుంచే పరీక్ష కేంద్రాలను తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిలు పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పక్కాగా అమలు చేశారు. మొత్తానికి తాండూరులో గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం రెండో రోజు ఉదయం మరో పరీక్ష కొనసాగనుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30574/