schedule Saturday, July 04, 2026

ఉప్పు కోసం వెళ్లి.. తిరిగిరాలేదు..!

calendar_today November 25, 2024
person dharshininews
ఉప్పు కోసం వెళ్లి.. తిరిగిరాలేదు..!
ఉప్పు కోసం వెళ్లి.. తిరిగిరాలేదు..! - కరణ్ కోట్ల 9 ఏండ్ల బాలిక అదృశ్యం - కిడ్నాప్ అయ్యిందని గ్రామంలో పుకారు - విచారణ చేపడుతున్న కరణ్ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఉప్పు ప్యాకెట్ కోసం కిరాణా షాపుకు వెళ్లిన 9 ఏండ్ల బాలిక అదృశ్యమయ్యింది. కాగా బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని గ్రామంలో పుకార్లు వచ్చాయి. ఈ సంఘటన తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. కరణ్ కోట్ పోలీసులు, బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరణ్ కోట్ గ్రామానికి చెందిన బక్క లాలమ్మ మనుమరాలు స్వాతి (9) స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఈనెల 22న సాయంత్రం 4గంటల వేళ ఉప్పు ప్యాకెట్ తీసుకవచ్చేందుకు సమీపంలోని కిరాణా షాపుకు వెళ్లింది. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. మనురాలు స్వాతి కోసం లాలమ్మ గ్రామంలో వెతుకుతుండగా అదే గ్రామానికి చెందిన సామెల్ బాలికను గుర్తుతెలియని వ్యక్తులు బైకు మీద ఎక్కించుకుని వెళ్లారని తెలిపాడు. దీంతో లాలమ్మ కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. కిడ్నాప్ అంటూ పుకారు రావడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరోవైపు అదృశ్యమైన బాలిక గత నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి పెద్దేముల్ లో ఉన్న తన చిన్న బిడ్డ వద్దకు వెళ్లిందని, అప్పుడు బాలికను తీసుకవచ్చినట్లు లాలమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/30787/