schedule Saturday, July 04, 2026

మహిళ కానిస్టేబుల్ ధారుణ హత్య

calendar_today December 2, 2024
person dharshininews
మహిళ కానిస్టేబుల్ ధారుణ హత్య
మహిళ కానిస్టేబుల్ ధారుణ హత్య - సొంత అక్కను చంపిన తమ్ముడు - కారుతో ఢీకొట్టి.. కొడవలితో దాడి చేసి ఘోరం - పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..? - రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : మహిళ కానిస్టేబుల్ ధారుణ హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో కానిస్టేబుల్ తమ్ముడే ఆమెను కారుతో ఢీకొట్టి.. కొడవలితో నరికి ఘారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... రాయపోలు గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్(మాల), అదే గ్రామానికి చెందిన కొంగర నాగమణి (కురుమ )చిన్నపాటి నుండి కలిసి చదువుకున్నారు. 10 సంవత్సరాల నుండి ఇద్దరు ప్రేమించుకున్నారు. నవంబర్ 10 వ తేదిన శ్రీకాంత్, నాగమణి కులాంతరవాహం చేసుకున్నారు. కులాంతరవాహం చేసుకున్న నాగమణి 2020 లో కానిస్టేబుల్ కు విధులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. శ్రీకాంత్, నాగమణి కలిసి హయత్ నగర్ లో ఉంటున్నారు. నిన్న ఆదివారం సెలవు కావడంతో సొంత గ్రామం రాయపోల్ కు వచ్చారు. విషయం తెలుసుకున్న నాగమణి తమ్ముడు పరమేష్ అక్కను చంపివేయాలని పక్క ప్లాన్ వేసుకుని, సోమవారం రోజున ఉదయం కానిస్టేబుల్ నాగమణి తన ద్విచక్ర వాహనం పై రాయపోల్ గ్రామం నుండి హయత్ నగర్ కు విధులకు వెళ్ళుతుందగా అప్పటికే ప్లాన్ వేసుకున్న తమ్ముడు పరమేష్ తన కారులో కొడవలి పెట్టుకొని నాగమణి ద్విచక్ర వాహనం (ఓలా యాక్టివా) ను వెనుక నుండి టీ కొట్టడంతో నాగమణి బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. తన వెంట తెచ్చుకున్న కొడవలితో నాగమణి మెడ పై దాడి చేసి హత్య చేశాడు. అంతకు ముందే ఫోని చేసి చంపుతానని చెప్పి చంపేశాడు. హత్యకు గురైన నాగమణి అక్కడిక్కడే ప్రాణం కోల్పోయింది. నిందితుని పోలీసులకు లొంగిపోయి పోలీసుల అదుపులోకి ఉన్నట్లు సమాచారం. రాయపోల్ గ్రామంలో పరువు హత్యకు గురైన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కానిస్టేబుల్ నాగమణి మృతి దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం వచ్చి హత్య జరిగిన వివరాలు సేకరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31099/