schedule Friday, September 11, 2026

జర్నలిస్టులపై దాడి అప్రజాస్వామికం

calendar_today December 11, 2024
person dharshininews
జర్నలిస్టులపై దాడి అప్రజాస్వామికం
జర్నలిస్టులపై దాడి అప్రజాస్వామికం - మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలి - తాండూరులో జర్నలిస్టుల ఆందోళన - మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జర్నలిస్టులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని తాండూరు జర్నలిస్టులు మండిపడ్డారు. టీవీ9 జర్నలిస్టుపై సీనీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ బుధవారం తాండూరులో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఆందోళనలో పలు జర్నలిస్టుల సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, ఆర్వో రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టుపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించారు. కుటుంబ విషయాలను రచ్చకీడ్చంతో కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడం అప్రజాస్వామి కమన్నారు. విలువలు మరిచి దాడికి పాల్పడిన మోహన్ బాబుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, దిశ కమిటి సభ్యురాలు అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31406/