schedule Sunday, September 06, 2026

లీలావతి డిశ్చార్జ్..!

calendar_today December 19, 2024
person dharshininews
లీలావతి డిశ్చార్జ్..!
లీలావతి డిశ్చార్జ్..! - నాలుగు రోజులు నిమ్స్ లో చికిత్స - ఖర్చలన్నీ భరించిన ఎస్టీ వెల్ఫేర్ శాఖ - వసతిగృహ ఘటనలో అందరు సురక్షితం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన బాలికల వసతి గృహ ఫుడ్ పాయిజన్(ఆరోపణలు) ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన లీలావతి అనే బాలిక క్షేమంగా కోలుకుంది. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుంది. ఈ నెల 10న వసతి గృహాంలో సరిగ్గా ఉడకని కిచిడి, ఆహారం తిని బాలికలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మొత్తం 11 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఇందులో 8వ తరగతి చదువుతున్న లీలావతీ అనే బాలిక పరిస్థితి విషమంగా మారడంతో 13వ తేదిన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల పాటు బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అన్ని పరీక్షలు నిర్వహించి.. అందుకు తగిన వైద్యం అందించడంతో బాలిక క్షేమంగా కోలుకుంది. దీంతో ఈనెల 17న రాత్రి బాలికను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు. లీలావతితో పాటు వసతి గృహ భోజనం ఘటనలో అమ్మాయిలు అందరు క్షేమంగా కోలుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా తీవ్ర అస్వస్థకు గురైన బాలిక లీలావతిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి.. అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకునేంత వరకు బాలికతో పాటు వారి తల్లిదండ్రులకు వసతులు, ఖర్చులు అన్ని శాఖ తరుపున భరించడం జరిగిందని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31559/