గుండెను కాపాడుకుందాం రండి..!
December 25, 2024
dharshininews
గుండెను కాపాడుకుందాం రండి..!
- రేపు తాండూరులో అవగాహన సదస్సు
- తాండూరు ఐఎంఏ సహాకారంతో ఏర్పాటు
- హాజరు కావాలని యువ జాగృతి పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నేటి ఆధునిక జీవన శైలిలో గుండె పోటు నుంచి రక్షణ పొంది ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. గుండె లయను ఎలా కాపాడుకోవాలో తెలిపేందుకు తాండూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సహాకారంతో రేపు గురువారం అవగాహాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు యువ జాగృతి సభ్యులు తెలిపారు. తాండూరు పట్టణంలోని హిమాలయ హోటల్‌లో గురువారం ఉదయం 11గంటలకు యువతలో గుండెపోటు అకస్మిక మరణాల నివారణ పేరుతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గుండెపోటు వైద్యులు డా.దయ వాస్వని హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. యువత గుండెపోటు నుంచి కాపాడుకునేందుకు అవసరమయ్యే సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/31661/