schedule Saturday, September 12, 2026

మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్..!

calendar_today December 30, 2024
person dharshininews
మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్..!
మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్..! - ఆపరేషన్‌ స్మైల్ టీం రెడీ - జనవరి 1 నుంచి తనిఖీలు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : జిల్లాలో నమోదైన చిన్నారుల మిస్సింగ్ కేసులపై యంత్రాంగం దృష్టిసారిస్తోంది. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమం చేపట్టబోతోంది. ఇందులో భాగంగా సోమవారం DPO వికారాబాద్ సమావేశ మందిరంలో జనవరి మాసంలో నిర్వహించే ఆపరేషన్ స్మైల్ -XI కార్యక్రమం లో భాగంగా అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు SP గారు మాట్లాడుతూ.. జిల్లాలో జనవరి1 నుండి 31 వరకు అధికారులు, పోలీసు, లేబర్,స్వచ్ఛంద సంస్థలు, పిల్లల సంక్షేమ కమిటీ, చైల్డ్ లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జిల్లాకు చెడ్డ పేరు లేకుండా, చట్టానికి అనుకూలంగా సవాల్ గా తీసుకొని తలెత్తుకొనేలా చూడాలన్నారు. బాల కార్మికులు లేకుండా, తప్పిపోయిన పిల్లల విషయంలో చైల్డ్ లైన్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పిల్లల సంక్షేమ కమిటీ చైర్మన్ వెంకటేష్,పోలీస్ ఇన్స్పెక్టర్ లు ఆంజనేయులు, అన్వర్ పాషా , బిఆర్ బి కో ఆర్డినేటర్ కాంతా రావు, WCD members, చైల్డ్ లైన్ ప్రతినిధులు, AHTU టీం సభ్యులు, లేబర్ డిపార్ట్మెంట్ సభ్యులు, ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31843/