schedule Saturday, July 04, 2026

చోరీకి వచ్చి టెంప్ట్‌ అయ్యాడు..!

calendar_today December 31, 2024
person dharshininews
చోరీకి వచ్చి టెంప్ట్‌ అయ్యాడు..!
చోరీకి వచ్చి టెంప్ట్‌ అయ్యాడు..! - వైన్‌ షాపులోనే అవుట్‌ అయిన దొంగ - సీసీ కెమెరాలలో విడీయో రికార్డు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఒక్కో దొంగకు ఒక్కో వీక్‌నెస్ ఉంటుంది. అవే వారి కొంప ముంచి అడ్డంగా దొరికిపోయేలా చేస్తాయి. పైన ఫోటోలో ఉన్న దొంగ చేసిన పనికి.. అమ్మదొంగా అనాల్సిందే. వైన్‌షాపులోకి చోరీకి వచ్చిన ఒక దొంగ ఫుల్లుగా మద్యం తాగి అక్కడే నిద్రపోయి..దొరికిపోయి పోలీసులకు దొరికేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో చోటుచేసుకుంది. నార్సింగి మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్స్ నిర్వాహకులు ఆదివారం రాత్రి పనిగంటలు అయిపోగానే… షాపుకు తాళం వేసి వెళ్లిపోయారు. తిరిగి సోమవారం ఉదయం వచ్చి షాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక వ్యక్తి వైన్ షాప్‌లో బాగా మద్యం సేవించి పడుకొని ఉండడం సిబ్బంది గమనించారు. అతిగా మద్యం సేవించి స్పృహలేని స్థితిలో అక్కడ పడిపోయి ఉన్నాడు. వైన్ షాప్ పై రేకులు తొలగించి లోనికి చొరబడిన వ్యక్తి డబ్బులు, మద్యం బాటిల్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాడు.. వెళ్లిపోయే టైంకి..అక్కడ ఉన్న మందు బాటిల్స్ చూసి టెంప్ట్ అయిపోయి.. బాటిల్ ఓపెన్ చేశాడు. అతిగా మద్యం సేవించడంతో.. మత్తు తలకెక్కి సొమ్మసిల్లిపోయాడు. అతడని అదుపులోకి తీసుకున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని 108 వాహనంలో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని.. రాత్రి వరకు స్పృహలోకి రాకపోవడంతో అతడెవరన్న వివరాలు తెలియలేదని ఎస్సై అహ్మద్‌ మొయినుద్దీన్‌ తెలిపారు. షాప్ లోపలికి వచ్చిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి .అయితే లోపలికి వచ్చాక సీసీ కెమెరాలను ధ్వసం చేసాడు దొంగ.. అన్ని బాగానే చేసాడు కానీ మందును చూసి టెంప్ట్ అయ్యి ఫుల్‌గా తాగి ఆగం అయిపోయాడు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31854/