schedule Saturday, July 04, 2026

మద్యం సేవించి వాహనాలు నడుపరాదు

calendar_today January 6, 2025
person dharshininews
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు - బైకులు నడిపే వారు హెల్మెట్ ధరించాలి - ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలి - కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎవ్వరు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బైకులు నడిపే వారు హెల్మెట్ ధరించాలని కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు. 33వ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా సోమవారం కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో వాహన దారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్ఐ విఠల్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పక వాడాలన్నారు. మద్యం సేవించి, సెల్ ఫోన్‌ మాట్లాడుతూ బైకులు నడిపించరాదన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు బాధ్యతగా పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్టేషన్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32065/