schedule Saturday, July 04, 2026

కమీషనర్‌ను తిట్టిన కాంగ్రెస్ నేత..!

calendar_today January 7, 2025
person dharshininews
కమీషనర్‌ను తిట్టిన కాంగ్రెస్ నేత..!
కమీషనర్‌ను తిట్టిన కాంగ్రెస్ నేత..! - కన్నెర్ర చేసిన కార్మికులు - మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన - క్షమాపణ చెప్పాలని డిమాండ్ - ఎమ్మెల్యే దృష్టికి వ్యవహారం, పరిష్కరిస్తానని హామి తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల కోసం పనిచేస్తున్న మున్సిపల్ కమీషనర్ ను కాంగ్రెస్ పార్టీ నేత అసభ్యంగా దూషించారని కార్మికులు కన్నెర్ర చేశారు. మంగళవారం ఉదయం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హాబీబ్ లాల సోమవారం మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డికి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని మరోకరికి ఫోన్ చేసి కమీషనర్ గురించి అసభ్యంగా మాట్లాడారు. సామాజిక మాధ్యమంలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మికులు మంగళవారం ఉదయం విధులు బహిష్కరించి కార్యాలయం ముందు బైటాయించారు. కాంగ్రెస్ నేతకు వ్యతి రేకంగా నినాదాలు చేశారు. హబీబ్ లాల కమీషనర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి. కౌన్సిలర్ సోమశేఖర్ తదితరులు వచ్చి కార్మికులతో మాట్లాడారు. విషయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కమీషనర్, హాబీబ్ లాల మద్య వివాదాన్ని పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. దీంతో కార్మికులు శాంతించారు. కాంగ్రెస్‌ నేత హబీబ్‌ లాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ ఫోన్ లేపలేదని అసభ్యంగా మాట్లాడడం తగదన్నారు. పని ఒత్తిడి, కార్యక్రమాలు, సమావేశాలలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తే పరిస్థితి ఉండదన్నారు. అలాంటి సందర్భాలలో దూషించడం పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32074/