schedule Thursday, September 03, 2026

లవంగం పాలలో పుల్ స్టామినా..!

calendar_today February 21, 2025
person dharshininews
లవంగం పాలలో పుల్ స్టామినా..!
లవంగం పాలలో పుల్ స్టామినా..! - బీపీని అదుపులో ఉంచే బూస్టర్ - పొట్ట శుభ్రపర్చడంలో సాయం - ఇంకా సంతానోత్పత్తికి మేలు దర్శిని డెస్క్ : పాలలో లవంగాల పొడిని కలిపి తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. లవంగాలలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పాలు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D, ఫాస్పరస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. లవంగాల పాలు తాగితే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం. లవంగం పాలు తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. అలసట, బద్ధకం తొలగిపోతాయి. ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం శరీరంలో కొత్త శక్తిని నింపుతాయి. లవంగం పాలు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జలుబు, దగ్గుతో బాధపడేవారికి ఇది సూపర్ డ్రింక్ అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా బీపిని అదుపులో ఉంచుతాయి. బద్దకం, అలసట, నీరసం అన్ని క్షణాల్లో మాయమవుతాయి. మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు లవంగం పాలు అమృత సమాన ఔషదంగా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. లవంగం పాలు తాగడం వల్ల శరీరంలోని రక్తపోటు స్థాయి అదుపులో ఉంటుంది. రక్తపోటును నియంత్రించే లక్షణాలు లవంగాల్లో ఉన్నాయి. అందుకే బీపీ రోగులు లవంగాల పాలు తాగాలని నిపుణులు చెబుతున్నారు. లవంగాల పాలు తాగితే జీర్ణవ్యవస్థను బలపడుతుంది. పొట్టను శుభ్రపరచడంలో లవంగాలు సాయపడతాయి. లవంగాల్ని పాలులో కలిపి తాగితే జీవ క్రియ వేగవంతం అవుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతాయి. పెద్దపేగును శుద్దిచేసి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో లవంగం పాలు అద్భుతంగా సహాయపడతాయి. లవంగం పాలు తాగితే దంతాలు, ఎముకలు బలపడతాయి. పంటి నొప్పి, నోటి దుర్వాసన, వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి. పంటి నొప్పి, చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన మొదలైన సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. లవంగం పాలు పురుషుల్లో సంతానోత్పత్తికి స్టామినా బూస్టర్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. లవంగం పాలకున్న యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయని అంటున్నారు.. లవంగాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి పురుషుల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33215/