schedule Thursday, September 10, 2026

తాండూరు యువకులకు ఆర్మీలో అవకాశం

calendar_today March 29, 2025
person dharshininews
తాండూరు యువకులకు ఆర్మీలో అవకాశం
తాండూరు యువకులకు ఆర్మీలో అవకాశం - ఒకేసారి రిక్రూట్ అయిన ఇద్దరు స్నేహితులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : భారత దేశ ఆర్మీ విభాగానికి తాండూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులకు అవకాశం దక్కింది. స్నేహితులైన ఈ ఇద్దరిని భారత ఆర్మీలో సైనికులుగా నియమించింది. వివరాల్లోకి వెళితే... యాలాల మండలం బాగాయిపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, సందీప్ లు తాండూరు మండలం జినుగుర్తి సమీపంలోని మోడల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకుని ఉన్నత చదువులు కూడా చదువున్నారు. ఇటీవల జరిగిన ఆర్మీ నియామక ర్యాలీలో శ్రీనివాస్, సందీప్ పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన రిక్రూట్ లో సైనికులుగా అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి, పీఈటీ యాదగిరి, విద్యార్థులు, గ్రామస్తులు అభినందించారు. మరోవైపు యువకులు భారత ఆర్మీలో సైనికులగా అవకాశం దక్కడం గర్వకారణంగా ఉందని అన్నారు. దేశ రక్షణకు తమవంతు బాధ్యతలను నిర్వహిస్తామన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34373/