schedule Saturday, July 04, 2026

ఓటు హ‌క్కును న‌మోదు చేసుకుందాం

calendar_today November 6, 2021
person dharshininews
ఓటు హ‌క్కును న‌మోదు చేసుకుందాం
ఓటు హ‌క్కును న‌మోదు చేసుకుందాం - ఆన్లైన్లో దరఖాస్తుకు అవ‌కాశం - త‌ప్పొప్పులు, బ‌దిలీకి చాన్స్ వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ ఓటు హ‌క్కును న‌మోదు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. 18 ఏండ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఓటు హ‌క్కును నమోదు చేసుకోవాల‌ని సూచించింది. వ‌చ్చేనెల డిసెంబర్ 15వ తేదీ లోపు గ‌డువు విధించ‌గా ఓకు హ‌క్కును ఆన్‌లైన్ ద్వారా న‌మోదు చేసుకునేందుకు వెసులుబాటును క‌ల్పించింది. ఇందుకోసం వెబ్‌సైట్‌ను www.ceotelangana.gov.in ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్ ద్వారా ఎలా ఓటు హ‌క్కును న‌మోదు చేసుకోవాలో తెలుసుకోవాల‌నుకునే వారు ముందుగా వెబ్సైట్లోకి వెళ్లి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వీటిని సంబంధిత మండల స్థాయి అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే 2022 జనవరి 15న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. ధ్రువపత్రాలు తప్పనిసరి తొలిసారిగా ఓటరుగా తమ పేరు నమోదు చేసు "కునే వారు వయస్సు నిర్ధారణ పత్రాలు తీసుకెళ్లాలి. విద్యాసంస్థ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు తప్పనిసరి. బూత్ స్థాయి కేంద్రాల్లో బీఎల్ ల వద్ద ఉండే దరఖాస్తు ఫారాలను పూరించి అవసరమైన ధ్రువీకరణ పత్రాల నకళ్లు జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త‌ప్పు.. ఒప్పుల‌కు చాన్స్ ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరా లపై పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్లు, గ్రామపం చాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పంచాయతీల్లో ఓటరు జాబితా సిద్ధంగా ఉంచారు. వాటిలో పేర్లు ఉన్నాయో లేవో చూసుకుని వెంటనే నమోదు చేసు కోవచ్చు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఎవ్వరైనా వ్యక్తం చేయొచ్చు. మరణించిన వారి పేరు జాబితాలో ఉంటే, ఇతర ప్రాంతాల్లో ఓట రుగా నమోదు అయి ఉన్నట్లు ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేసే అవ‌కాశం క్ప‌లించారు. అంతేకాకుండా ఓట‌రు తాను కోరుకున్న చిరునామాకు త‌మ పేరును బ‌దిలీ చేసుకునే సదుపాయం కూడ క‌ల్పించారు.