భళా.. బాలిక..!
April 11, 2025
dharshininews
భళా.. బాలిక..!
- సాంకేతిక హంగులతో స్మార్ట్ సీటీ
- సైన్స్ ఫేయిర్ లో ఆకట్టుకున్న ప్రదర్శన
- విద్యార్థి ఆలోచనకు అందరు ఫిదా
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదివేది 9వ తరగతి అయినా ఆ అమ్మాయి.. సాంకేతిక యుగంలో ఉండే ఓ కొత్త స్మార్ట్ సిటి నిర్మాణానికి రూపం అందించింది. తన ఆలోచనలతో రూపొందించిన ప్రాజెక్టుతో భళా బాలిక అనిపించకుంది. విద్యార్థి ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనకు అందరు ఫిదా అయ్యారు.
శుక్రవారం తాండూరు పట్టణం సేయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫేయిర్ లో ఓ ప్రాజెక్టు హైలెట్ గా నిలిచింది. డా. ఉదయ్ కిరణ్, హేమలత(తాండూరు మండలం జినుగుర్తి సమీపంలోని గిరిజన గురుకుల కాలేజీలో టీచర్)ల కూతురు సెహ్ రిష్ ఉపధ్రితి ఉప్పాడ సేయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేయిర్ లో స్మార్ట్ సీటీ అనే ప్రాజెక్టుతో ప్రదర్శన ఇచ్చింది. ఈ సైన్స్ ఫేయిర్ కోసం ఆమె ఎవ్వరి సాయం లేకుండా ఒక్కతే 30 రోజులు కష్టపడి తన ఆలోచనలతో కొత్తగా స్మార్ట్ సీటీ నిర్మించింది. సాంకేతిక యుగంలో స్మార్ట్ సీటీ ఎలా ఉంటుంది.. ఉండాలనే ఊహతో రూపొందించిన ప్రదర్శన అబ్బుర పరిచింది. విమానాశ్రయం, రైల్వ స్టేషన్, వందే భారత్ రైలు, సెల్ టవర్లు, ఫ్యాక్టరీలు, ఫైర్ స్టేషన్, క్రెడిట్, డెబిట్ కార్డులతో షాపింగ్, ఆసుపత్రులు, ఆపార్ట్ మెంట్లు, విల్లా తదితర సౌకర్యాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు ప్రదర్శనలో చూపించింది.
స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫేయిర్ లో ఈ ప్రదర్శన హైలెట్ గా నిలిచింది. అంతేకుండా ప్రదర్శనలతో స్మార్ట్ సీటీ వల్ల అందుబాటులోకి వచ్చే ఉపయోగాలు, మానవులకు కలిగే లాభాలను వివరించింది. స్మార్ట్ సీటీ వల్ల భవిష్యత్తు తరాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చంటూ అందరికి అవగాహన కల్పించింది. బాలిక ఆలోచనకు అందరు ఫిదా అయ్యి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఇదికూడా చదవండి....
https://www.dharshininews.com/34704/