schedule Sunday, September 06, 2026

ఆపద్భాందవులు అంబులెన్స్ సిబ్బంది..!

calendar_today April 19, 2025
person dharshininews
ఆపద్భాందవులు అంబులెన్స్ సిబ్బంది..!
ఆపద్భాందవులు అంబులెన్స్ సిబ్బంది..! - పసికందుకు పునర్జన్మ అభినందనీయం - సన్మానించిన గాజీపూర్ గల్లి బాయ్స్ యూత్ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్నవారికి సాయం అందించే అంబులెన్స్ సిబ్బంది ఆపద్బాందవులతో సమానమని పెద్దేముల్ మండలం గాజీపూర్ గల్లీ బాయ్స్ యూత్ సభ్యులు అభివర్ణించారు. ఈనెల 13న పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామనికి చెందిన నాగమ్మకు అర్థరాత్రి సమయంలో పురిటి నొప్పులతో రావడంతో 108 లో తాండూర్ తరలిస్తుండగా మార్గమధ్యలో డెలివరీ అయ్యింది. ప్రసవంలో పుట్టిన పసిబాలుడికి ఎటువంటి చలనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందగా 108 సిబ్బంది EMT నర్సింలు CPR చేసి ప్రాణాన్ని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం గాజీపూర్ గ్రామానికీ చెందిన గల్లి బాయ్స్ యూత్ సభ్యులు 108 సిబ్బంది అయిన EMT నర్సింలు, పైలెట్ లు మహేష్,నర్సింలు ను ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆపత్కాలంలో అంబులెన్స్ సిబ్బంది అందించే సేవలు మరువలేనివని అన్నారు. సమయ స్పూర్తితో పసికందుకు సీపీఆర్ చేసి పునర్జన్మ ప్రసాదించడం అభినందనీయన్నారు. నిస్వార్థంగా అందించే సేవలకు సలాం అని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు సంగమేశ్వర్, జనార్ధన్, అనిల్, శివానంద్, శ్రీను, కృష్ణ,,సందీప్, రాము, నవీన్, బాలు, చంద్రశేఖర్, నవీన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34975/