schedule Thursday, September 03, 2026

సార్.. నా హెలీకాప్టర్ ఎగుర్తలేదు..!

calendar_today April 23, 2025
person dharshininews
సార్.. నా హెలీకాప్టర్ ఎగుర్తలేదు..!
సార్.. నా హెలీకాప్టర్ ఎగుర్తలేదు..! - అమ్మిన వ్యాపారిపై కేసు వేయండి - పోలీస్టేషన్‌కు వెళ్లిన బాలుడు - సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ దర్శిని డెస్క్ : కొన్ని సందర్భాలలో పోలీస్టేషన్‌కు వింత ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ మద్య కాలంలో చిన్న పిల్లలు కూడా పోలీస్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్‌లు చేస్తున్నారు. ఇదే కోవలో ఓ బాలుడు పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా కంగ్టీలో జరుగుతున్న జాతరలో వినయ్‌ రెడ్డి అనే బాలుడు ఉత్సాహంగా జాతరకు వెళ్లి తనకు నచ్చిన బొమ్మ హెలికాప్టర్‌ను రూ. 300లకు కొనుగోలు చేశాడు. ఆశగా ఇంటికి వచ్చి ఎగరేసేందుకు ప్రయత్నించగా.. అది కనీసం కదలలేదు. తిరిగి జాతరకు వెళ్లి అది ఇచ్చి మరొకటి తెచ్చుకున్నాడు. రెండోది కూడా మొరాయించడంతో మరొకటి తెచ్చుకున్నాడు. మూడోదైనా పనిచేస్తుందేమోనని ఎగరేసిన బాలుడి..ఆశలు అడియాశలయ్యాయి. ఇలా కుదరదని మరోసారి దుకాణం దగ్గరికి వెళ్తే ఆ యజమాని ఆ బాలుడిపై కోపంతో తిప్పి పంపించాడు. దీంతో బాలుడు నేరుగా విషయాన్ని అక్కడి ఎస్ఐకి వివరించి, బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని, డబ్బులు తిరిగి ఇవ్వకుండా యజమాని తనను తిట్టాడని ఫిర్యాదు చేశాడు. పదేళ్ల పిల్లాడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే స్పందించారు. ఎస్ఐ ఆదేశాల మేరకు ఓ కానిస్టేబుల్ జాతర వద్దకు వెళ్లి విచారణ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసు అక్కడికి చేరుకునే సమయానికే ఆ బొమ్మల దుకాణం యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బాలుడి తాతను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం వినయ్ రెడ్డికి నచ్చజెప్పి, ఇంటికి పంపించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35060/