schedule Saturday, July 04, 2026

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది..!

calendar_today April 28, 2025
person dharshininews
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది..!
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది..! - భావి పౌరులను తీర్చిదిద్దేది టీచర్లే - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ఘనంగా సరిత టీచర్ ఉద్యోగ విరమణ తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణం శ్రీ గీతా మందిరంలో పెద్దేముల్ మండలం మంబాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఇంగ్లీష్ టీచర్(స్కూల్ అసిస్టెంట్) సరిత ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై సరిత టీచర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని అన్నారు. నాలుగు గోడల మద్య విద్యా బుద్దులు నేర్పిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దే శక్తి టీచర్లకే ఉందని అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో తనదైన ముద్రవేసిన సరిత టీచర్ ఉద్యోగ విరమణ తరువాత జీవీతం సాఫిగా సాగాలని ఆకాంక్షించారు. మరోవైపు ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమానికి హాజరైన తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ద్యావరి నరేందర్ రెడ్డి, బాకారం జైపాల్ రెడ్డి, పీఆర్టీయూ పెద్దేముల్ మండల అధ్యక్షులు పోల నవీన్ కుమార్, జిల్లా బాధ్యులు రమేష్‌, శంకర్, శ్రీనివాస్, అశోక్, విద్యేత్త వేణుగోపాల్, మంబాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాస్, న్యూనలంద స్కూల్ కరస్పాండెంట్ చంద్రమోహన్ రెడ్డి, ఆర్యవైశ్య మహా సభ జిల్లా ఉపాధ్యక్షులు కట్కం వీరేందర్, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35239/