schedule Saturday, July 04, 2026

గోవధ నిందితులను శిక్షించాలి..!

calendar_today June 10, 2025
person dharshininews
గోవధ నిందితులను శిక్షించాలి..!
గోవధ నిందితులను శిక్షించాలి..! - నరికిన గోవు తలపై బీజేపీ నేతల సీరీయస్ - కరణ్‌ కోట్‌ పోలీసులకు ఫిర్యాదు తాండూరు రూరల్, దర్శినిప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో గోవు తల నడిరోడ్డున పడేసిన సంఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తాండూరు రూరల్ సీఐ నగేష్, కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా కార్యదర్శి బంటారం బద్రేశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్ తదితరులు మాట్లాడుతూ హిందువులు దైవంగా పూజించే గోవులను వధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గోవధ నిషేధ చట్టం అమల్లో ఉన్న ఇలాంటి సంఘటనలకు పాల్పడడం దారుణమన్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయన్నారు. ధారూర్ సమీపంలో పశువుల కళేబరాలతో నూనే తయారు చేస్తున్నారని, రాస్నం సమీపంలో పశువుల కళేబరాలను నిల్వ చేస్తున్నారని ఆరోపించారు. గోవధకు పాల్పడుతున్న దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ హైదరాబాద్ రోడ్డు మార్గంలో గోవు తల లభించిన సంఘటనను తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన చేశారు. గోవు తలను పరీక్షల నిమిత్తం చెంగిచెర్లలోని సెంట్రల్ మీట్ రిసెర్చ్ ఇన్సిట్యూట్ కు పంపించడం జరిగిందని తెలిపారు. పరీక్షల అనంతరం తల గోవుదా.. లేకా ఎద్దుదా.. అనేది తేలుతుందన్నారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఎవరైనా వ్యర్థాలు తరలించే క్రమంలో గోవు తల పడిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితమే తలను నరికేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36097/