schedule Thursday, September 03, 2026

జీవితాలను మార్చే ఏటీసీ..!

calendar_today August 26, 2025
person dharshininews
జీవితాలను మార్చే ఏటీసీ..!
జీవితాలను మార్చే ఏటీసీ..! - విద్యార్థులకు అద్భుత అవకాశం - యువత భవిత మారుస్తున్న ఎమ్మెల్యే - యూత్‌ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని వెనుకబడిన విద్యార్థుల జీవితాలను మార్చేందుకు ఏటీసీ(ఐటీఐ) కాలేజీ అందుబాటులోకి రావడం శుభపరిణామం అని యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్‌ కుమార్ అన్నారు. kvcs మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ నేటి తరం యువతకు కంపెనీలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అత్యాధునిక ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో తాండూరులో కూడా ఏటీసీ సెంటర్ అందుబాటులోకి రావడం అడ్మిషన్లు కూడా ప్రారంభించడం సంతోషకరమన్నారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో అధునాతన కోర్సులు అందించడం.. పదో తరగతి అర్హతతోనే ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. త్వరగా ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ప్రయోజనకరమన్నారు. అద్భుత అవకాశాలు కల్పించే ఏటీసీతో వెనుకబడిన విద్యార్థుల జీవీతాలు మారడం ఖాయమన్నారు. ఈనెల 28వ తేదిలోపు విద్యార్థులు అడ్మిషన్లు పొంది ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి...   https://www.dharshininews.com/38142/