schedule Saturday, July 04, 2026

పప్పు చేస్తుండగా పేలిన ఫ్రెషర్ కుక్కర్.!

calendar_today August 27, 2025
person dharshininews
పప్పు చేస్తుండగా పేలిన ఫ్రెషర్ కుక్కర్.!
పప్పు చేస్తుండగా పేలిన ఫ్రెషర్ కుక్కర్.! - వంట మనిషి, ఇద్దరు విద్యార్థులకు గాయాలు - తాండూరు నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వంట కోసం పప్పు చేస్తుండగా ఫ్రెషర్‌ కుక్కర్ పేలింది. ఒక్కసారిగి జరిగిన ఘటనలో వంట మనిషి, ఓ ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం తాండూరులోని నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో జరిగింది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పీపీయూనిట్‌లో గత కొంత కాలంగా నర్సింగ్ కాలేజీ, హాస్టల్‌ కొనసాగుతున్నాయి. ఈ కాలేజీ, హాస్టల్‌లో మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో సుమారు 100 మందికి పైగా చదువుకుంటున్నారు. బుధవారం హాస్టల్‌లో వంటగదిలో వంట మనుషులు వంట చేస్తున్నారు. వారికి విద్యార్థులు సహకరించారు. వంటలో భాగంగా పప్పును ఫ్రెషర్ కుక్కర్‌లో వేసి వండుతున్నారు. kvcs ఒక్కసారిగా ఫ్రెషర్ కుక్కర్ పేలింది. ఈక్రమంలో వంట మనిషితో పాటు ఇద్దరు విద్యార్థులపై వేడి పప్పు ఎగిసిపడింది. దీంతో వారికి కాలిన గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే పక్కనే ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలివెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఫ్రెషర్ కుక్కర్ పేలడంతో హాస్టల్‌లో నాసిరకం వంట పాత్రలు వినియోగిస్తున్నారేమా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38190/