schedule Saturday, July 04, 2026

పట్ట పగలే.. దారుణం..!

calendar_today September 21, 2025
person dharshininews
పట్ట పగలే.. దారుణం..!
పట్ట పగలే.. దారుణం..! - కత్తితో మహిళ దారుణ హత్య - అల్లుడే.. హంతకుడు..?! - తాండూరు పట్టణంలో కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పట్ట పగలే దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో మహిళపై దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆదివారం కలకలం రేపింది. స్థానికుల ప్రాథమిక సమాచారం మేరకు.. తాండూరు పట్టణం వాల్మీకీనగర్ ప్రాంతానికి చెందిన పిచ్చకుంట్ల పద్మమ్మ (50), రాజు దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. kvcs అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. స్థానికంగా పందులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం పద్మమ్మ తాండూరు పట్టణం మల్లప్ప మడిగ సమీపంలో రోడ్డు పక్కన పంది మాంసం మాంసం విక్రయించేందుకు వచ్చింది. సరిగ్గా మద్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి పద్మమ్మ వద్దకు వచ్చి అక్కడే ఉన్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న పద్మమ్మను స్థానికులు ఆటోలో పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పద్మమ్మపై దారుణానికి పాల్పడిన వ్యక్తి ఆమెకు అల్లుడు అవుతాడని తెలిసింది. వెంకటేష్ అనే వ్యక్తి పాత కక్ష్యలు మనసులో పెట్టుకుని హత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా నిందితుడు పోలీసులు ఎదుడ లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. సమగ్ర దర్యాప్తు తరువాత పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38681/