schedule Thursday, September 03, 2026

జిల్లాలో ఫస్ట్ ఏటీసీ..!

calendar_today September 26, 2025
person dharshininews
జిల్లాలో ఫస్ట్ ఏటీసీ..!
జిల్లాలో ఫస్ట్ ఏటీసీ..! - రేపే ప్రారంభానికి ముహుర్తం - ప్రారంభించనున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐటీఐ కాలేజీల స్థానంలో వికారాబాద్‌ జిల్లాలో మొట్ట మొదటిగా అందుబాటులోకి తెచ్చిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారయ్యింది. తాండూరులోని ఏటీసీ సెంటర్‌ను రేపు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రం ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ రోడ్డు మార్గం డబుల్ బెడ్ రూం ఇండ్ల సమీపంలోని కొత్తగా నిర్మించిన కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఏటీసీలో అధునాతన పరికాలు అందుబాటులో ఉంచారు. ప్రారంభించబోతున్న ఏటీసీ సెంటర్‌లో అడ్మిషన్లు కూడా పూర్తి అయ్యి తరగతులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం ఆరు కోర్సులతో ఏటీసీ సెంటర్ కొనసాగుతోంది. అన్ని కోర్సులలో 160 సీట్లు ఉండగా అన్ని అడ్మిషన్లు పూర్తి కావడంతో పాటు రిజర్వ్‌డులో మరో 20 అడ్మిషన్లు ఉన్నాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38817/