schedule Thursday, September 03, 2026

రిజర్వేషన్ల పిటీషన్ తిరస్కరణ..!

calendar_today October 6, 2025
person dharshininews
రిజర్వేషన్ల పిటీషన్ తిరస్కరణ..!
రిజర్వేషన్ల పిటీషన్ తిరస్కరణ..! - హైకోర్టులోనే తేల్చుకోవాలన్న సుప్రీం కోర్టు - తెలంగాణ ప్రభుత్వానికి ఊరట హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల అమలుపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ తిరస్కరణకు గురయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై దాఖలైన పిటీషన్‌పై సుప్రిం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించిందని బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన లాయర్ తెలిపారు. kvcs అయితే, హైకోర్టులో స్టే ఇవ్వాడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీపీ రిజర్వేషన్లపై అక్కడికే వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కేసు డిస్మిస్ అని చెప్పడంతో.. పిటిషనర్ తరపు న్యాయవాది ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38991/