schedule Wednesday, September 09, 2026

బీఆర్ఎస్ పార్టీకి షాక్...!

calendar_today October 7, 2025
person dharshininews
బీఆర్ఎస్ పార్టీకి షాక్...!
బీఆర్ఎస్ పార్టీకి షాక్...! - కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు - 200ల మంది కార్యకర్తలతో నేతల చేరిక - ఆహ్వానించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తాండూరు మండలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో హస్తం గూటిలోకి వచ్చారు. మండలంలోని చెన్ గేష్ పూర్, కోనాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌ గౌడ్, మరి కొంత మంది నాయకులతో పాటు కార్యకర్తలు మొత్తం 200ల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. kvcs ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, యూత్ కాంగ్రెస్ తాండూరు పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39006/