schedule Saturday, July 04, 2026

శభాష్.. ఆదిత్య వర్దన్..!

calendar_today October 7, 2025
person dharshininews
శభాష్.. ఆదిత్య వర్దన్..!
శభాష్.. ఆదిత్య వర్దన్..! - నీట్ ర్యాంకర్‌కు మనోహరన్న అభినందన - సన్మానించిన తాండూరు ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : నీట్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించిన ఆదిత్య వర్దన్‌ను శభాష్ అంటూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వ గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించడం గొప్ప విషయమని కితాబిచ్చారు. యాలాల మండలం బందమీది పల్లి గ్రామానికి చెందిన బషీరాబాద్ సాక్షి విలేకరి నర్సిములు, పద్మ దంపతుల కొడుకు ఆదిత్య వర్ధన్ ఈ మధ్యే జరిగిన నీట్ లో ఉత్తమ ర్యాంక్ సాధించి కామినేని మెడికల్ కళాశాలలో ఫ్రీ ఎంబీబీఎస్ సీటు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు పట్టణంలోని వారి నివాసానికి వెళ్లారు. అక్కడ విద్యార్థి ఆదిత్య వర్ధన్‌ను కలిసి శాలువ పూల మాలతో ఘనంగా సన్మానించారు. kvcs ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీగా ఎంబీబీఎస్ సీటు సాధించేలా కృషి చేయడం అభినందనీమయని, ఆదిత్య వర్దన్‌ను శభాష్‌ అంటూ అభినందించారు. అదేవిధంగా ఆదిత్య తల్లిదండ్రులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ మురళి కృష్ణ, మాధవ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సిములు, చందర్, ఉదయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39010/