schedule Saturday, July 04, 2026

పత్తికి.. నిప్పు..!

calendar_today October 13, 2025
person dharshininews
పత్తికి.. నిప్పు..!
పత్తికి.. నిప్పు..! - మంటపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు - కౌలు రైతుకు తీరనినష్టం - పొలీసులను ఆశ్రయించి ఫిర్యాదు - బసీరాబాద్‌ మండలంలో ఘటన బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : కష్టపడి పండించిన పత్తికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. అగ్గికి బుగ్గిపాలైన పంటతో కౌలు రైతుకు తీవ్రనష్టం వాటిళ్లింది. ఈ సంఘటన బషీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. బాధిత కౌలు రైతు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎక్మాయి గ్రామానికి చెందిన దానం కృష్ణ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని ఓ వ్యక్తికి చెందిన 8 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగుచేశారు. చేతికొచ్చిన పంట నుంచి దాదాపు 15క్వింటాళ్ల పత్తిని దిగుబడి చేసుకున్నారు. పొలం నుంచి పత్తి ఏరిపించి పొలం వద్దనే నిల్వ ఉంచుకున్నారు. మొత్తం పత్తిని తరలించేందుకు ఆదివారం కూలీలను మాట్లాడేందుకు కర్ణాటకకు వెళ్లారు. అయితే ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పొలం వద్ద ఉన్న పత్తి పంటకు నిప్పంటించారు. మంటలకు పూర్తిగా పత్తి కాలి బూడిదయ్యాయి. kvcs సోమవారం ఉదయం కృష్ణ వచ్చి చూసే సరికి బూడిదే మిగిలింది. తనకు తీవ్ర నష్టం జరిగిందని బషీరాబాద్ పోలీస్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఎస్ఐ నూమన్ అలీ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు బాధిత కౌలు రైతు కృష్ణ మాట్లాడుతూ పత్తి పంటకు నిప్పంటించిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్. అదేవిధంగా ప్రభుత్వం నుంచి తనకు నష్టపరిహారం అందేవిధంగా చూడాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39100/