schedule Wednesday, September 09, 2026

అభిమాన నేతతో.. ఆత్మీయ భేటి..!

calendar_today October 15, 2025
person dharshininews
అభిమాన నేతతో.. ఆత్మీయ భేటి..!
అభిమాన నేతతో.. ఆత్మీయ భేటి..! - లండన్‌లో స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసిన హేమంత్ కుమార్ - స్పీకర్‌తో కలిసి విందు, విశేషాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : లండన్‌లో తన అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌తో తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ ఆనంద క్షణాలను గడిపారు. లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను తాండూరు మండలం చెంగోల్ గ్రామ మాజీ సర్పంచ్ హేమంత్ కుమార్ కలిశారు. ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే చెంగోల్ గ్రామ సర్పంచ్ హేమంత్ కుమార్ గత కొన్ని ఏండ్ల నుంచి లండన్ లో స్థిరపడ్డారు. లండన్ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చారని విషయం తెలుసుకున్న హేమంత్ కుమార్ బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. kvcs గడ్డం ప్రసాద్ కుమార్ కు హేమంత్ కుమార్ అభిమానుడుగా ఉన్నారు. ఈ మేరకు తమ నాయకుడు లండన్ వచ్చారని తెలుసుకుని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను హేమంత్ కుమార్ కలిశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి హేమంత్ కుమార్ విందు చేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించుకున్నారు. తన అభిమాన నాయకుడుతో కలిసి ఆనందంగా గడపడం పట్ల హేమంత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39158/