schedule Sunday, July 05, 2026

పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల నమోదు

calendar_today October 24, 2025
person dharshininews
పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల నమోదు
పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల నమోదు - ఆన్ లైన్లో సమగ్ర వివరాలు పొందుపర్చాలి - వికారాబాద్‌ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆన్ లైన్లో ఇందిరమ్మ ఇండ్ల నమోదును పకడ్బందీగా చేపట్టాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి సుధీర్ ఆదేశించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించి.. పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నమోదు వివరాలను వార్డు ఆఫీసర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత మేరకు ఉందని అడిగారు. ఇందుకు మేనె జర్ నరేందర్ రెడ్డి స్పందిస్తూ మొత్తం 471 ఇండ్ల లక్ష్యం ఉందని చెప్పారు. kvcs అందులో 156 మంది లబ్దిదారులను గుర్తించి ఆన్ లైన్ లో నమోదు చేయడం జరిగిందని వివరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా వివరాలను పొందుపర్చాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ మణిపాల్, శానిటరీ ఇను స్పెక్టర్ ఉమేష్ కుమార్, ఈఈ ప్రవీణ్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39228/