schedule Wednesday, September 09, 2026

భక్తుల కోసం.. భక్తులు..!

calendar_today October 25, 2025
person dharshininews
భక్తుల కోసం.. భక్తులు..!
భక్తుల కోసం.. భక్తులు..! - దేవాలయంలో అన్నదానం - సేవా తత్పరతకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేవాలయాల వద్ద రాజకీయ నేతలు, లేదా వ్యాపారులు, ప్రముఖులు అన్నదానాలు చేయడం మామూలే. భక్తులే ఏకమై దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్నదానం చేయడం చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన తాండూరు పట్టణంలో జరుగుతోంది. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో హనుమాన్ దేవాలయం ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయ నిర్వహణ కొనసాగుతోంది. దేవాలయ పాలకవర్గంతో పాటు పలువురు వ్యాపారులు, ప్రముఖులు ఈ దేవాలయంలో అన్నదానాలు చేస్తున్నారు. గత కొన్ని నెలులగా దేవాలయానికి వచ్చే భక్తులు కొత్త సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. kvcs దేవాలయానికి వచ్చే భక్తులు ఏకమై అన్నదానా కార్యక్రమానికి ముందుకు వచ్చారు. గత కొన్ని వారాలుగా హనుమాన్ దేవాలయానికి వచ్చే భక్తులకు అన్నదానం చేస్తున్నారు. శనివారం కూడా దేవాలయంలో భక్తుల ఆధ్వర్యంలోనే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలో భక్తులే.. భక్తుల కోసం అన్నదానం నిర్వహిస్తున్న సంప్రదాయానికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. శనివారం దేవాలయానికి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదాలను స్వీకరించారు. భక్తుల రద్దీతో దేవాలయం సందడిగా మారింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39241/