సమైక్యతా సౌరభౌముడు సర్దార్..!
October 31, 2025
dharshininews
సమైక్యతా సౌరభౌముడు సర్దార్..!
- వల్లభాయ్ పటేల్‌కు జోహర్లతో నివాళులు
- తాండూరులో ఉత్సహాంగా రన్ ఫర్ యూనిటీ
- పాల్గొన్న డీఎస్పీ, రాజకీయ, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సౌరభౌముడుగా కీర్తించారు. శుక్రవారం తాండూరులో స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోమ్ మంత్రి, బార్డోలీ వీరుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తాండూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా నుంచి చేపట్టిన ర్యాలీలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో డీఎస్పీతో పాటు తాండూరుకు చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. ర్యాలీలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు.
అనంతరం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న సంస్థానాలను దేశంలో విలీనం కావడానికి గట్టిగా కృషి చేశారు. స్వతంత్రంగా ఉండాలనుకునే 526 సంస్థానాలను దేశంలో విలీనం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఉక్కుమనిషిగా ఆయన కృషి వల్ల దేశం సమైక్యతగా మారిందని అన్నారు. అందుకే ఆయన సమైక్యతా సౌరభౌముడుగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సీఐ నగేష్, పోలీసు సిబ్బంది, పట్టణ వాసులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39321/