కమణీయం.. పార్వతీపరమేశ్వరుల కల్యాణం
October 31, 2025
dharshininews
కమణీయం.. పార్వతీపరమేశ్వరుల కల్యాణం
- తాండూరు నగరేశ్వర దేవాలయంలో కార్తీక శోభ
- కళ్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులు
- వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం కమణీయంగా జరిగింది.
వాసవీ మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం నగరేశ్వర స్వామి ఆలయంలో పార్వతీపరమేశ్వరుల కల్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి నగ రేశ్వర ఆలయంలో దేవతా విగ్రహాలకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మద్య పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు. పరమేశ్వరుడి తరుపున సింగంశెట్టి శోభ-పద్మ నాభం, పార్వతీదేవి తరుపున కొట్రిక నాగలక్ష్మి-శ్రీకాంత్ దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
ఈ కళ్యాణ వేడుకలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయ లక్ష్మి, ఆర్యవైశ్య సంఘం ఆధ్యక్షులు శ్రీనివాస్, వినోద్, సంఘం సభ్యులు, పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39323/