schedule Thursday, September 10, 2026

ఆర్టీసీ కార్తిక మాసం ఆఫర్..!

calendar_today November 1, 2025
person dharshininews
ఆర్టీసీ కార్తిక మాసం ఆఫర్..!
ఆర్టీసీ కార్తిక మాసం ఆఫర్..! - శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు సర్వీసు - 30 మంది ఉంటే.. ప్రత్యేక బస్సు బుకింగ్‌కు చాన్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పండగలు, తీర్థయాత్రల సమయాల్లో భక్తుల కోసం ఆర్టీసీ సంస్థ విశిష్ట సేవలను అందించేందుకు ముందుకోస్తుంది. తాజాగా కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను అందించేందుకు సిద్దమైంది. ప్రయాణికుల కోరిక మేరకు శ్రీశైలం, పంచారామాలు, అరుణాచలం ప్రాంతాలకు ప్రత్యేక యాత్ర సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఆయా శైవ క్షేత్రాలను ఎంపిక చేసి దర్శనం చేయించడం, సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యతలు తీసుకుంటోంది. అవసరమైన వారు బుకింగ్‌ చేసుకోవాలని, తేదీని నిర్ణయిస్తామని ఆర్డీసీ అధికారులు తెలిపారు. kvcs 30మంది ఉంటే గ్రామం నుంచి, లేదా పట్టణం నుంచి అదనపు బస్సు నడిపించనున్నారు.సెల్‌:8309348157లో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీపో అధికారులు కోరుతున్నారు. మరింత మంది ముందుకొస్తే వారు కోరిన ఆలయాలకు బస్సులు పంపించే ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39330/