schedule Thursday, September 10, 2026

అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు..!

calendar_today November 6, 2025
person dharshininews
అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు..!
అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు..! - బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం సమంజసం కాదని బీఆర్ఎస్ పార్టీ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు అన్నారు. మూడు రోజుల క్రితం తాండూరులో జరిగిన దర్నాలో పాల్గొన్న నాయకులపై తాండూరు పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని గురువారం ఓ ప్రకటనలో ఖండించారు. చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో జరిగిన దుర్ఘటన మరోసారి జరగరాదనే ఉద్దేశంతో నాయకులు దర్నా చేపట్టారని అన్నారు. తాండూరు ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ కూర్చోవాలా..? అని ఆవేధన వ్యక్తం చేశారు. kvcs మహిళలు , యువకులు,సీనియర్ సిటిజన్స్ ఇలా అన్ని కుల సంఘాలు స్వచందంగా తరలివచ్చి చేసిన శాంతియుత ధర్నా చేపట్టారని అన్నారు. ప్రభుత్వలు మేల్కొని కళ్ళుతెరిచి రోడ్డులు మరమ్మత్తులు చేయించాల్సింది పోయి.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం తగదు అని అన్నారు. వెంటనే బనాయించిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి అని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39451/