schedule Thursday, September 03, 2026

ఫోటో, క్యూఆర్ కోడ్‌ ఉంటే చాలు..!

calendar_today November 19, 2025
person dharshininews
ఫోటో, క్యూఆర్ కోడ్‌ ఉంటే చాలు..!
ఫోటో, క్యూఆర్ కోడ్‌ ఉంటే చాలు..! - వచ్చే నెల నుంచి కొత్త నిబంధన - ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ నిర్ణయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ ఆధార్‌ను ఉపయోగించి వయస్సు ధృవీకరణ ప్రక్రియను మెరుగుపరచడానికి యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) కొత్త రూల్ తీసుకరాబోతోంది. ఫోటో, క్యూఆర్ కోడ్‌ ఉంటే చాలు అనే విధానంను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగపరిచే అవకాశాన్ని నివారించడంతోపాటు ఆఫ్‌లైన్‌ పద్ధతిలో ఆధార్‌ కార్డును పరిశీలించే పద్ధతికి స్వస్తి పలకవచ్చని సంస్థ భావిస్తోంది. కేవలం వయసును మాత్రమే తెలియజేసి ఇతర ప్రైవేటు సమాచారాన్ని దాచేలా ఈ నిబంధనను రూపొందించబోతున్నారు. mAadhaar యాప్ స్థానంలో కొత్తగా యాప్ DigiYatra యాప్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈవెంట్‌లు, సినిమా హాళ్లు, కనీస వయోపరిమితి 18 సంవత్సరాలతో కొన్ని ఉత్పత్తుల కొనుగోలు, అలాగే విద్యార్థుల ధృవీకరణ, హోటళ్లలో చెక్-ఇన్, నివాస సంఘాలలోకి ప్రవేశించడం వంటి వివిధ పరిస్థితులలో వ్యక్తులను ధృవీకరించడంలో ఈ కొత్త యాప్ సహాయపడుతుందని UIDAI మరో అధికారి తెలిపారు. వచ్చే నెల నుంచి అమలులోకి తేవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేవలం వయసును మాత్రమే తెలియజేసి ఇతర ప్రైవేటు సమాచారాన్ని దాచేలా ఈ నిబంధనను రూపొందించబోతున్నారు. ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ ఉంటే చాలు’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఆధార్‌ నంబరును సేకరించడం, కాపీలను నిల్వ ఉంచుకోవడం నిషిద్ధమని ఆధార్‌ చట్టం చెబుతోంది. అయినప్పటికీ అనేక సంస్థలు ఆధార్‌ కార్డు కాపీలు తీసుకోవడంతోపాటు వాటిని తమవద్ద ఉంచుకుంటున్నాయి’ అని భువనేశ్‌ కుమార్‌ తెలిపారు. “త్వరలో OVSEల కోసం ఒక అప్లికేషన్‌ను తెరుస్తాము” అని అధికారులు తెలిపారు. “OVSEల వివరాలను ధృవీకరిస్తాము. ఆమోదించిన తర్వాత, ఆధార్ డేటాబేస్ నుండి డేటాను అప్‌డేట్ చేయడానికి QR కోడ్‌ను యాక్సెస్ చేయడానికి OVSEలు సాంకేతిక ఏకీకరణను ప్రారంభించాల్సి ఉంటుంది.” అని UIDAI అధికారులు వివరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39720/